Wednesday, November 11, 2015

శివత్వం

రావణుడైనా రాముడైనా శివభక్తి ఒక్కటే
రారాజులైనా బీదవాడైనా శివశక్తి ఒక్కటే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ప్రయత్నిస్తే తప్పక పట్టుకోవచ్చు శివ తత్వాన్ని
పట్టొచ్చేస్తే జన్మంతా కట్టుకోవచ్చు శివత్వాన్ని
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నీతోపాటూ అమ్మని కూడా చూస్తున్నా కదా
అటు మనసు లాగేస్తోంది, కొడుకుని కదా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

అమ్మని అడిగితే నాకు సాయం చేస్తుంది
నీతో మాటాడి మోక్షం రాయించేస్తుంది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ముద్దుల కొడుకునిగా, అమ్మ దగ్గర మారాం
మీ ఇద్దరూ ఆదుకొనగా, పాపాలన్నీ రాంరాం
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఇంకెంతకాలమీ పరీక్షలు సామీ చాలు
మది నిండుగా నువ్వుంటే అదే పదివేలు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఒక్కసారి నిన్ను చూడాలని కోరిక
అత్యాశని తెలిసినా మది మానదిక
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment