కామంతో కళ్ళు కనబడని బ్రతుకులు
నీ చల్లని చూపు పడితే పాపం పరారు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
నీ చల్లని చూపు పడితే పాపం పరారు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
నీ కరుణ కావాలంటే మేమేం చెయ్యాల ?
శివశివ అంటూ ఉన్నా చాలదా ఇయ్యాల ?
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
శివశివ అంటూ ఉన్నా చాలదా ఇయ్యాల ?
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
చెంచుకే మోక్షమిచ్చిన ఘనుడవే
నా మూఢభక్తి కనలేవా భలేవాడివే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
నా మూఢభక్తి కనలేవా భలేవాడివే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
మేము చదివితే వచ్చేది విజ్ఞానం
నీవు కరుణిస్తే ఇచ్చేది మోక్షజ్ఞానం
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
నీవు కరుణిస్తే ఇచ్చేది మోక్షజ్ఞానం
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!
No comments:
Post a Comment