ఏమయా సాంబ శివ శివ
కైలాసవాస
ఏమయా సాంబ శివ శివ
కైలాసవాస
ఏమయా సాంబ శివ శివ
ఏమయా స్వామి సొమ్ము
లేమి లేకపోయెనా
పాములను ధరించుటేమి
పాపమో శివ శివ
lఏమయాl
లేమి లేకపోయెనా
పాములను ధరించుటేమి
పాపమో శివ శివ
lఏమయాl
ఎగ్గులేని పరిమళములు
ఎన్ని అయిన కలవు నీకు
బుగ్గి పూసుకొనుట యెంత
పుణ్యమో శివ శివ
lఏమయాl
ఎన్ని అయిన కలవు నీకు
బుగ్గి పూసుకొనుట యెంత
పుణ్యమో శివ శివ
lఏమయాl
వెర్రివాడవు అయితే గావు
వెండికొండ దొరవు నీవు
పుర్రెలో భుజించు
టెంత భావ్యమో శివశివ
lఏమయాl
వెండికొండ దొరవు నీవు
పుర్రెలో భుజించు
టెంత భావ్యమో శివశివ
lఏమయాl
మూడు మూర్తులకును నీవు
మూలమైన దేవుడవై
కూడు భిక్షమెత్తుట
ఎవరికోసమో శివ శివ
lఏమయాl
మూలమైన దేవుడవై
కూడు భిక్షమెత్తుట
ఎవరికోసమో శివ శివ
lఏమయాl
అంగలములు పల్లకీలు
అశ్వములును కలవునీకు
ఎద్దునెక్కి తిరుగు సుఖమ
దేమయా శివ శివ
lఏమయాl
అశ్వములును కలవునీకు
ఎద్దునెక్కి తిరుగు సుఖమ
దేమయా శివ శివ
lఏమయాl
మేటి దేవుడయిన నీవు
మంచుకొండ విడచి నిటుల,
కాటివెంట తిరుగుట
యెంత ఖర్మమో శివ శివ
lఏమయాl
మంచుకొండ విడచి నిటుల,
కాటివెంట తిరుగుట
యెంత ఖర్మమో శివ శివ
lఏమయాl
వరుస చామర్తి లక్ష్మి నరసు
నిన్ను వేడినాను
అరసి బ్రోవవేమి
అన్యాయమో శివ శివ
lఏమయాl
నిన్ను వేడినాను
అరసి బ్రోవవేమి
అన్యాయమో శివ శివ
lఏమయాl
- చామర్తి లక్ష్మీ నరసింహం
No comments:
Post a Comment