Monday, October 5, 2015

ఈ మనసు

నేనెంతలే, మా రాత గీసే నీపై రాతలేటిలే
నీ బుద్ధి నాకిచ్చి రాయమన్నావులే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

చుక్కని చూస్తె చక్కగుండదు
చుక్కాని లేని ఈ పాడు మనసు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నీ పేరింటే చాలు కాసేపు గెంతులేస్తాది
ఆనక చూస్తె, పక్కదారి పట్టేస్తాది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

కామాల్లేని కామాలలో మునకలు
జన్మంతా ఈటితోటే పరుగులు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

లింగం చూస్తె ఏడుపొస్తాది, ఆనందం
పక్కోడిని చూస్తే ఏడుపొస్తాది, కండకావరం
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

కాసేపు అదిగో శివుడు ఉన్నాడంటాది
కాసేపు ఎవడా శివుడు ఉన్నాడా అంటాది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నువ్వెక్కడున్నావని తిక్కచేసేది ఇదే
నువ్వు లేవన్నోడి తలతిక్కతీసేదీ  ఇదే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నే కాయలేకున్నా ఈ మనసు పేచీ
ఒజ్జ వి నీవే, ఇక నీదే ఆ పూచీ
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment