Monday, October 5, 2015

సందడే సందడి

నిన్నొదల్ను నువ్వేటన్నా, కొట్టినా తిట్టినా
మరి నాకా శక్తియ్యాలి నువ్వే ఎట్టైనా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

సూస్తున్నా కదా, నీ ఇంటికొచ్చిన సంది
ఎటైనాదో ఈ గుండెలో సందడే సందడి
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

వెండికొండల కూర్చుంటె నేనేటి ఆన్తాను
కుసింత కొండ దిగిరా, నువ్వన్నట్టె ఆడ్తాను
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నంది మందిలతో కైలాసమంతా కిట కిటా
మరి నా సంగతేంది, తీస్కుపో టక టకా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

కావమని కాకల్లె కావుకావన్నా
కానివానిని కాదు కాపుకాయరన్నా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

కనకమంటే, కాసులంటే, కన్నెలంటే వెంటెంటే
శునకమంటి మనసులింతే, ఇదే మనుషులంటే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

పుట్టిస్తావు, గిట్టిస్తావు, మధ్యలో మా తిత్తి తీస్తావు
ఏమాటరా నీది లింగా అంటే ఇట్టే కరిగిపోతావు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment