Friday, October 9, 2015

నా పంట పండాలి

నానేటి సేసినా తప్పనుకోక నా తప్పు కాయాల
మనసులో నిన్నుంచా ఇక నేను ఒప్పులే సెయ్యాల
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నిను కలుసుకోవాలి, నీతోటి తిరగాలి
నీ పాదమంటాలి, నా పంట పండాలి
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

చాల సార్లడిగా, నావైపు సూడమని
నువ్వు సూత్తుంటావులే, అది నే సూదామని
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

దయతోడ సూత్తుంటే కష్టమేమీలేక ఒళ్ళు బరువెక్కింది
ఊష్టమోస్తే చాలు శివ శివా‌ అంటూ, యెక్కెక్కి యేడ్చింది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

అందమంటే ఏది? ఇది కాదు, ఇల్లిదీ కాదు
అందకుండా అది సిత్తంలో దాగుంది కాదూ
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఈబూధి పుండ్రాళ్ళు అవి నీకు ఇష్టాలు
ఈ ఒళ్ళంత పూసుకున్నా దాటించు కష్టాలు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

మీ పెద్దోడి పుట్టినరోజు ఈడ పూజలు, కుడుములు 
అసలు పుట్టుకే లేనోడ్కి రోజూ నా మనసు ముడుపులు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

బతుకునందు శక్తి ఎండంగ సంపుతున్నావురా
మనసునందు భక్తి నిండార నింపుతున్నావురా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment