Tuesday, October 6, 2015

నా గుండెని పరిచినా

గద్దెలా మిద్దెలా నిన్ను పూజిస్తేటిస్తావ్
మహా అయితే ఒట్టి మోక్షాన్ని ఇచ్చెస్తావ్
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

కాష్టంలో ఉంటావేటి ఎప్పుడు చూసినా
ఇష్టంతో ఉండరాదేటి నా గుండెని పరిచినా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

కోపమొస్తే అంతే ఇంక పట్టలేమంటగా నిన్ను
జాలిజూస్తే ఇంతే జట్టుకట్టిఒగ్గవింక మమ్ము
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నీ ఆలోచనలే రోజురోజంతా నమ్ము
కలకాలమిలా ఉండేలా వరమిమ్ము
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

బూడిదిష్టమంటే ఏటనుకుంటారందరూ
మా చివరి రూపమదే అని తెలుసుకునేదెందరు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

పాములతో ఆటలేటి, పులితోలుతో బట్టలేటి
బడుగు బతుకుల ఇసము చిమ్మెటోళ్ళ సంగతేటి
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఆది లేదు అంతం లేదు నీకు జన్మమా అదీ లేదు
నిన్ను నమ్మినా నాకు చిత్తంలో మర్మమేమీ చేతకాదు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

సత్తువుంటే కళ్ళు మూసుకుపోతాయేటి సిత్రం
ఈ విత్తు సత్తూ ఉంటే విప్పారిపోతాయిచిత్రం
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment