Monday, October 5, 2015

నీ తలపులు

కళ్ళతో సూడాలంటే కనిపించవు
కలల్ల ఎప్పుడూ ఆడుతుంటవు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరాదా శంకరన్నా !!!

నువ్వు తలపులోకొస్తె ఏటేటో అనిపిస్తది
నా గుండె తలుపుల కోస్తె నీకు తెలిసొస్తది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరాదా శంకరన్నా !!!

సుక్క నీరు నీపై పోస్తే అబ్బో సంబరం
తైతక్కలోడా నీవే దిక్కురా సంతతం
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరాదా శంకరన్నా !!!

మనిద్దరికీ ఎప్పుడో జట్టు కుదిరింది
నా మదినసలొదలని నీ పట్టు అదిరింది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరాదా శంకరన్నా !!!

అమ్మతో కలిసి షికారుకెళ్ళేవా సామీ
కుసింత పొద్దు పొడిచింది సూసుకో సుమీ
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

జ్ఞానమంతా అమ్మకి సెప్పేసినావ్
ఏటి నేర్చుకోవాలో మా బుర్రకొగ్గేసినావ్
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఇంతికి ఇంట్లో సగం, ఒంట్లో సగం
మరి నీ కాళ్ళకాడ నాకీయరాదా యోగం
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

పెళ్లి పెళ్ళాం, ఇల్లు పిల్లలు తప్పవు
మళ్ళీ మళ్ళీ నీ ఆలోచనలు వదలవు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment