Thursday, October 22, 2015

నీ దయ కావాలి

మంచిసెప్తే చాలు మరిగిపోతుంది నెత్తురంతా
చెడుసూస్తే చాలు కరిగిపోతుంది సత్తువంతా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నన్ను నేను మార్చుకోవాలంటే హరా
నీ దయ కావాలి కదా శంకరా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఆపలేని కోరికలు విచ్చుకుంటే
కాపులేని అడవిలో చిచ్చు తంతే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

కోతినేరా సత్యముగా తోకలేదంతే
స్వాతిముత్యముగ మారాలి నీభారమంతే
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఇంతకీ నిన్ను నేను నమ్మినట్టేగాదా
నాకేటి తెల్సు నీవే చెప్పిపెట్టరాదా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

సక్కంగా ఉండాలన్న కోరిక గొప్పది
నిక్కంగా అలా ఉండటం సాలా దొడ్డది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నీది కాదుగా పక్కనోడి బతుకు
నీకెందుకది, నీ మెతుకు నువ్వు కతుకు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

నీవు వర్షించే వరాల జల్లువు
నువ్వు హర్షించేలా అడిగా మరి ఇవ్వు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment