Monday, October 5, 2015

దైవచింతన

దైవమంటే భక్తి గుండెలో నిండాలి
ప్రదర్శించే భక్తొద్దు వెంటనే వీడాలి
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

దేవుడున్నాడా అన్న అజ్ఞానం పోవాలి
దేవుడే దిక్కన్న సుజ్ఞానం రావాలి
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

చెడు చేస్తే దైవచింతన దూరమౌతుంది
దైవచింతనలో చెడు కాలిపోతుంది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

ఐహిక సుఖము లాగుతుంటుంది
హరనామ స్మరణ చేరవేస్తుంది
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

యాగాలు తపములు చేయలేవని తెలుసా
నిండార హరా అంటే చాలంట మనసా
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

పాడుబుద్ధులు నేర్వ పది నిముషాల పని నీకు
పాడెరోజున గర్వమణిగాక చీకాకు
పదాల నీ పాదాలు కడుగుతున్నా
కరుణించి కావరారా శంకరన్నా !!!

No comments:

Post a Comment